Monday, December 23, 2024

నేను అత్యంత కష్టపడిన సినిమా ‘గని’

- Advertisement -
- Advertisement -

Gani movie released on 8th april

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్ డ్రామా ‘గని’. ఈ చిత్రం ఈనెల 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ “నేను యాక్షన్ సినిమాలు చేద్దామని ఇండస్ట్రీలోకి వచ్చాను. అయితే నా వద్దకు లవ్‌స్టోరీలే ఎక్కువగా రాగా అవే సక్సెస్ అయ్యాయి. ఇక యాక్షన్ సినిమా చేయాలని ‘గని’ చేశాను. బాక్సింగ్ వంటి స్పోర్ట్ బేస్డ్ సినిమాలంటే నాకిష్టం. నా కెరీర్‌లో అత్యంత కష్టపడిన సినిమా ఇదే. సిక్స్‌ప్యాక్ బాడీ మెయింటేన్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సినిమాలో నా పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. ఇక గతంలో వచ్చిన బాక్సింగ్ చిత్రాలకంటే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందులో మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. తమన్ సంగీతం సినిమాని నెక్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇందులో ఉపేంద్ర పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సునీల్ శెట్టి పాత్ర సైతం కొత్తగా ఉంటుంది. ఇక ప్రస్తుతం ప్రవీణ్ సత్తారుతో చేస్తున్న సినిమా కూడా యాక్షన్ సినిమానే”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News