Monday, December 23, 2024

అతిరుద్ర మహాయాగానికి గంజ్, ఆర్యవైశ్య సంఘానికి ఎమ్మెల్యే ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

తాండూరు: తాండూరులో నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగానికి గంజ్ అసోసియేషన్, ఆర్యవైశ్య సంఘాన్ని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆహ్వానించారు. సోమవారం తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పర్యటించారు. గంజ్ అసోసియేషన్ సభ్యులతోపాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజవకర్గం ప్రజల సంక్షేమం , మంచి వర్షాలు కురవాలని, గ్రామాలంతా పచ్చగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగానికి పుణ్య దంపతులు, భక్తులందరూ హాజరుకావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ దీపానర్సింలు, బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నయ్యిం, గంజ్ అసోసియేషన్ అధ్యక్షులు పటేల్ రాంరెడ్డి, వ్యాపారులు ఖడ్గం వీరేందర్, దినేసింగ్ ఠాగూర్, నాయకులు నర్సింలు, శ్రీనివాస్‌చారి, రాఘవేందర్, బాలేశ్వర్‌గుప్తా, కట్కం వీరేందర్, శ్రీనివాస్, మురళీకృష్ణ, రవీంద్ర కుమార్, ఆర్యవైశ్య సంఘం మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News