Sunday, December 22, 2024

శేరిలింగంపల్లిలో భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శేరిలింగంపల్లిలో భారీగా గంజాయిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు 10 కేజీల గంజాయి సీజ్ చేశారు. ఒడిస్సా నుంచి ఆంధ్ర మీదుగా హైదరాబాద్ కు గంజాయిని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లో స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. గంజాయిని హైదరాబాద్ లో ఓ వ్యక్తి అప్పగించే ప్లాన్ చేస్తుండగా పట్టుకున్నారు. ఒడిస్సాకు చెందిన రాహుల్ అనే యువకుడిని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. గంజాయి చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి గచ్చిబౌలి ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు విక్రమ్ ఒప్పుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన విక్రమ్, ఒడిస్సాకు చెందిన జగన్నాథ్ బిస్వా పరారీలో ఉన్నారు. ఎన్ డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News