Thursday, January 23, 2025

గంజాయి ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -
  • 178 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

జిల్లేడుచౌదరిగూడెం: నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముఠాను శనివారం చౌదరిగూడెం మండలం లాల్‌పహాడ్ వద్ద జరిపిన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోతుగూడెం నుంచి కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు తరలిస్తున్న గంజాయిని విశ్వసనీయ సమాచారం ప్రకారం… మాదాపూర్ ఎస్‌ఓటి,షాద్‌నగర్ రూరల్ పరిధిలోని చౌదరిగూడెం పోలీసులు చౌదరిగూడెం మండల పరిధిలోని లాల్‌పహడ్ వద్ద తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో గంజా యి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను వారు పట్టుకున్నారు. వారినుంచి 89 ప్యాకెట్ల పొడి గంజాయి ప్యాకెట్లు, రెండు మొబైల్స్, 60 వేల నగదుతోపాటు వారి రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన దీపా ంకర్ అన ప్రధాన సరఫరా ద్వారా ఈ వ్యాపారం జరిపిస్తున్నట్లు వారు గుర్తించారు.

ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులుండగా వారిలో ముగ్గురిని అదుపులో తీసుకోగా మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయి పట్టివేతలో కీలకంగా వ్యవహరించిన శంషాబాద్ ఎస్‌ఓటి, షాద్‌నగర్ ఏసిపి రంగస్వామితోపాటు చౌదరిగూడెం పోలీసులను సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర, శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డిలు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News