Monday, January 20, 2025

సారపాకలో భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో గురువారం భారీగా గంజాయి పట్టుబడింది. ఇందుకు సంబంధించిన వివరాలను బూర్గంపాడు ఎస్ఐ పి. సంతోష్ విలేకరులకు తెలిపారు. సారపాకలో ఎస్ఐ సంతోష్ తన సిబ్బందితో కలిసి వాహన తనీఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి పాల్వంచ వైపునకు వెళ్తున్న ఐషర్ వ్యాన్ పోలీసులను చూసి అపకుండా వెళ్తుండగా వెంబడించిన ఐటీసీ స్కూల్ దగ్గర పట్టుకున్నారు. వ్యానును తనీఖీ చేయగా ఒక ప్రత్యేక డబ్బా ఏర్పాటు చేసుకుని దానిలో పది బస్తాలలో 196. 7(96 ప్యాకెట్లు) కేజీల గంజాయిని గుర్తించారు. గంజాయి విలువ రూ. 3, 93, 24, 000 రూపాయలు ఉంటుందని తెలిపారు.

పట్టుబడిన వ్యక్తులు మహారాష్ట్రలోని చాలిన్గాన్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ ఫారూఖ్ అల్తాఫ్ షేక్, దూలే ప్రాంతానికి చెందిన క్లీనర్ షేక్ ఖలీల్ గా తెలుసుకున్నారు. వారిని విచారించగా అరకు ప్రాంతం నుంచి గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు. ఆజాద్ అనే వ్యక్తి అరుకు పారెస్ట్ లో గురు అనే వ్యక్తి నుండి గంజాయి తీసుకుని నాందేడకు తరలిస్తే రూ. 10వేలు చెల్లిస్తానని తెలపడంతో గంజాయి రవాణాకు పాల్పడినట్లు నిందితుల ద్వారా తెలుసుకున్నారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి నలుగురు నిందితులతో పాటు లారీ యాజమాని సయ్యద్ ఖదీర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు. ఆజాద్, గురు, ఖదీత్- అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ సంతోష్ తోపాటు అదనపు ఎస్ఐ శ్రీనివాస నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News