Sunday, December 29, 2024

ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై గంజాయి స్మగ్లర్లు దాడి

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం: గంజాయి స్మగ్లర్లు ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఎక్సైజ్ పోలీసులు భద్రాచలం ఫారెస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఓ కారు వేగంగా దూసుకొచ్చి చెక్‌పోస్టు వద్ద ఆగకుండా వెళ్లిపోయింది. వెంటనే కానిస్టేబుల్ ఆ కారును వెంబడించారు. లక్ష్మీపురం వద్ద రోడ్డుగా అడ్డగా పోలీస్ వాహనం పెట్టడంతో స్మగ్లర్లు కానిస్టేబుల్‌పై దాడి చేశారు. పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా కారును అక్కడే వదిలేసి స్మగ్లర్లు పారిపోయారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News