Sunday, December 22, 2024

10 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణా/జఫర్‌గడ్ : మండల కేంద్రంలోని నల్లబండ వద్ద రెండు కార్లలో తరలిస్తున్న రూ. 10 లక్షల విలువ చేసే 100 కిలోల గంజాయిని పోలీసులు, రెవెన్యూ అధికారులు శనివారం సంయుక్తంగా పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్సై మాధవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా గంజాయి రవాణా జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఎస్సై మాధవ్ గౌడ్, తహసీల్దార్ స్వప్న, ఆర్ అనిల్ బాబు మండల కేంద్రంలోని నల్లబండ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో వర్థన్నపేట్ నుంచి రెండు కార్లు వస్తున్నాయి. పోలీసులను గమనించిన వారు కార్లను ఆపి పారిపోవడానికి ప్రయత్నించారు.

ఇంతలో వారిని వెంబడించిన పోలీసులు ఆరుగురు వ్యక్తులని పట్టుకున్నారు. ఇద్దరు పారిపోయారు. పట్టుకున్న వారిని విచారించగా విషయం వెలుగుచూసింది. అన్నవరం సమీపంలోని తుని నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు తెలిపారు. కారు డిక్కీలలో తనిఖీ చేయగా 50 ప్యాకెట్లలో తరలిస్తున్న 100 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారుగా రూ.10 లక్షలు ఉంటుందన్నారు. గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లు, 2 కార్లను అధికారులు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఎస్‌కె మహమూద్ అలియాస్ యాకూబ్, మొయిన్ షేక్ జబ్బార్, ఎస్‌డి రహీమ్, వకీల్ అహ్మద్, ఫరుఖ్ షా, నాయిమ్ అహ్మద్ అనే ఆరుగురు ఉన్నట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News