- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా పి గన్నవరం మాజీ ఎంఎల్ఎ పులపర్తి నారాయణ మూర్తి(68) కన్నుమూశారు. గురువారం ఉదయం పులపర్తికి గుండెపోటు రావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. బిఎస్ఎన్ ఎల్ లో పని చేస్తూనే 1996లో టిడిపి తరపున గన్నవరం నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో గన్నవరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలలో టిడిపి టికెట్ ఇవ్వకపోవడంతో బిజెపిలో చేరి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పులపర్తికి భార్య, కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
- Advertisement -