అమరావతి: బంధువుల ఇంట్లో గొడవ పెట్టుకొని బయటకు వచ్చిన బాలికపై ఏడుగురు అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎన్‌టిఆర్ జిల్లాకు చెందిన ఓ బాలిక(14) ఈ నెల 9న పక్కింటి మహిళతో కలిసి ఓ గ్రామానికి బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ నెల 13న అక్కడి గొడవ జరగడంతో మనస్థాపంతో బాలిక అక్కడి నుంచి బయటకు వచ్చింది. రజక్ అనే యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి తన బైక్‌పై లిఫ్ట్ ఇచ్చాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనిల్, జితేంద్ర అనే యువకులకు బాలికను అప్పగించడంతో వారు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం కేసరపల్లికి చెందిన అనిత్, హర్షవర్దన్, మరో యువకుడు బాలికను బంధించి అత్యాచారం చేసి అనంతరం ఆటోలో మాచవరంలో వదిలేశారు. ఆటో డ్రైవర్ గమనించి బాలికను స్థానిక పోలీసులకు అప్పగించాడు. బాలిక మాట్లాడలేని స్థితిలో ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
గన్నవరంలో బాలికపై ఏడుగురు అత్యాచారం
- Advertisement -
- Advertisement -
- Advertisement -