Monday, December 23, 2024

గన్నవరం ఎమ్మెల్యేకి తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తృటిలో ప్రమాదం తప్పింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ఎమ్మెల్యేకు పెద్దగా గాయాలు కాలేదు. శనివారం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాసింపేట వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

అయితే దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం కూడా ప్రమాదానికి గురైంది. ప్రమాదం నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ పెద్దగా గాయపడకుండా బయటపడడం విశేషం. ఈ ప్రమాదంలో వంశీతో సహా సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News