Sunday, December 22, 2024

టిడిపికి బిగ్ షాక్.. గంటా శ్రీనివాస్ గుడ్ బై?

- Advertisement -
- Advertisement -

అమరావతి: త్వరలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్ తగిలేలా ఉంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ టిడిపికి గుడ్ బై చెబుతున్నట్లు ఓ వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కోడుతోంది. గంటా శ్రీనివాస్ కోరుకున్న స్థానాన్ని టిడిపి అధిష్టానం నిరాకరించడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గురువారం తన అనుచరులతో రహస్య భేటీ నిర్వహించాడు. ఆ సమావేశంలో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లిలో పోటీ చేయాలని గంటాను చంద్రబాబు ఆదేశించారు. కానీ అక్కడ పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపటం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News