Sunday, December 22, 2024

చెత్తతో ఏటా రూ.2643 కోట్ల ఆదాయం తీసుకరావచ్చు: పవన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. జలం మనకు పూజ్యనీయమని, కాలుష్యం కాకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్లాస్టిక్ చెత్తాచెదారంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి ఎపి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తొలి సారి వచ్చారు. పవన్‌కు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యాలయంలో ఏర్పాటు చేసి ఫొటో ఎగ్జిబిషన్‌ను పవన్ తిలకించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం బాధగా ఉందని, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను పటిష్టంగా అమలు చేయాలని, చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయం పొందేలా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచనలు చేశారు.

ఎస్‌ఎల్‌ఆర్‌ఎంను తొలుత పిఠాపురం నుంచి ప్రారంభిస్తామని, వేస్ట్ మేనేజ్‌మెంట్, పరిశ్రుభతను ప్రజలు బాధ్యతగా తీసుకోవాలని, ఒక్కో పంచాయతీలో చెత్త సేకరించి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తామని, చెత్తతో ఏటా రూ.2643 కోట్ల ఆదాయం తీసుకరావచ్చని తెలియజేశారు. ఎపిలో 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వీలు పడుతుందని, రాష్ట్రంలో పంచాయతీల్లో ఎక్కడా డబ్బులులేవని, పంచాయతీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఒక్క రోజులో పంచాయతీల దుస్థితిని మార్చలేమని, పంచాయతీల్లో మార్పు తెచ్చేందుకు కొంత సమయం పడుతుందన్నారు. గతంలో కొందరు అధికారులు రూల్స్ ప్రకారం వ్యవహరించలేదని, ఆ అధికారి ఇప్పుడు వెళ్లిపోయినట్టున్నాడని, తప్పు చేసిన అధికారులను ఏ విధంగా శిక్షించాలో ఏమో? అని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News