Thursday, January 23, 2025

చెత్త ఏరివేత కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తాం

- Advertisement -
- Advertisement -
  • మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సు

సిద్ధిపేట అర్బన్: చెత్త ఏరివేత కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని 30వ వార్డులో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, వార్డు కౌన్సిలర్ ఫాతిమా బేగం వజీర్‌తో కలిసి వార్డులో కలియతిరిగుతూ ఆరుబయట ప్రాంతాలలో ఉన్న చెత్తను ఏరివేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా రాజనర్సు మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట పట్టణ ప్రజల ఆరోగ్యం గూర్చి, చెత్త లేని పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్ది రాష్ట్రానికే ఆదర్శంలో మరో మెట్టుకు చేర్చడంలో భాగంగా చేపట్టిన పట్టణంలో నడుస్తూ చెత్తను ఏరివేద్దాం కార్యక్రమం మొదటి దశను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. సిద్దిపేట పట్టణంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలకు మంత్రి హరీశ్ రావు శ్రీకారం చుట్టారని తెలిపారు.

సిద్దిపేట పట్టణంలో ఇప్పటికే ప్రజలందరు చెత్తను తడి, పొడి, హానికరమైన (మూడు రకాలుగా ) వేరుచేసి మున్సిపల్ వాహనాలకు అందిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్రములోని మిగితా మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సిద్దిపేట పట్టణంలో ఆరుబయట చెత్త లేకుండా చేయడమే సిద్దిపేట మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యం అని అన్నారు. పట్టణ కౌన్సిలర్లు, కో-అప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులందరు ఈ కార్యక్రమంలో పాల్గొని చెత్త ఏరివేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని దీని ద్వారా ప్రజలలో మార్పు వచ్చి ఆరుబయట చెత్త వేయకుండా కేవలం మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, కో-అప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News