Tuesday, January 21, 2025

మౌలాలి ఫ్లై ఓవర్‌పై చెత్త లారీ బీభత్సం

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: మల్కాగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మౌలాలి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై శుక్రవారం జీహెచ్‌ఎంసీ చెత్తను తీసుకు వెళ్లే ఓ లారీ వేగంతో బీభత్సం సృష్టించింది. వేగం అదుపు తప్పి, డివైడర్‌ను ఢీ కొట్టింది. అంతేగాకుండా ఈ ఘటనలో రాంగ్‌రూట్‌లో వస్తున్న రెండు బైక్‌లను ఢీకొట్టడంతో ఇద్దరు వాహనదారులు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని కేసు నమోదు చేసి, నిందితుడైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News