Thursday, January 23, 2025

చెత్తను మున్సిపల్ వాహనాలకు అందజేయాలి

- Advertisement -
- Advertisement -
  • మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు

సిద్దిపేట అర్బన్: చెత్తను మున్సిపల్ వాహనాలకు అందజేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. సిద్దిపేట పట్టణంలో ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి ఒక వార్డు చొప్పున కొనసాగుతున్నటువంటి నడుస్తూ చెత్త ఏరివేద్దాం కార్యక్రమంలో భాగంగా శనివారం మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు పట్టణంలోని 15వ వార్డులో స్థానిక వార్డు కౌన్సిలర్ పాతూరి సులోచన శ్రీనివాస్ రెడ్డితో కలిసి వార్డులో కలియతిరిగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డులో రోడ్లకు ఇరువైపులా ఉన్నటువంటి మురికి కాలువలలో పేరుకుపోయిన చెత్తను సేకరించారు.

వార్డులో ఇంటింటికి తిరుగుతూ చెత్తను మున్సిపల్ వాహనాలకు అందించే పద్దతిని పరిశీలించారు. పట్టణ ప్రజలందరు తప్పక చెత్తను తడి, పొడి,హానికరమైన చెత్తగా వేరు చేసి కేవలం మున్సిపల్ వహనాలకు మాత్రమే అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గురజాడ శ్రీనివాస్ , పట్టణ కౌన్సిలర్లు, కో-అప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News