Thursday, January 16, 2025

స్కూల్ టీచర్ జర్నీ

- Advertisement -
- Advertisement -

తాజాగా ‘విరాటపర్వం’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ సాయి పల్లవి ఇప్పుడు ‘గార్గి’ అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. గౌతమ్ రామచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ నెల 15న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే ఇదొక స్కూల్ టీచర్ జర్నీ గురించి తెలియజేసే చిత్రమని తెలుస్తోంది. ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆ రాత్రి ఆమె ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొందనేది ఇందులోని ప్రధాన కథాంశం. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి… 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య ఈ చిత్రాన్ని తమిళంలో ప్రేక్షకులకు అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News