Tuesday, January 28, 2025

జిల్లా నూతన అదనపు కలెక్టర్‌గా గరీమా అగర్వాల్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నూతన అదనపు కలెక్టర్ గా గరీమా అగర్వాల్ గురువారం సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లిన జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ స్థానంలో కరీంనగర్ జిల్లాలో అదనపు కలెక్టర్ గా పనిచేసి సిద్దిపేట జిల్లాకు బదిలీ అయ్యి అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన కలెక్టర్ గరీమా అగర్వాల్ శిక్షణ కలెక్టర్‌గా యాదాద్రి భువనగిరి జిల్లాలో అనంతరం రెండు సంవత్సరాలు జిల్లా అదనపు కలెక్టర్‌గా కరీంనగర్ జిల్లాలో రెండు సంవత్సరాలు విధులు నిర్వహించి దళిత బంధు పథకం, పోషక అభియాన్ కార్యక్రమం అమలు మరియు నేషనల్ పంచాయతీ అవార్డు రావడానికి కృషి చేసి అందరి మన్ననలు పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News