Sunday, February 23, 2025

టిప్పు సుల్తాన్ విగ్రహానికి చెప్పుల దండ..యువకుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు మైసూర్ ప్రాంతాన్ని పరిపాలించిన టిప్పు సుల్తాన్ కు కర్నాటకలో ఎంతో క్రేజ్ ఉంది. అనేక ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు కనబడతాయి. అయితే మాన్వి తాలూకాలోని శిరివర పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహానికి ఓ యువకుడు బుధవారంనాడు చెప్పుల దండ వేయడంతో టిప్పు సుల్తాన్ పట్ల గౌరవ ప్రపత్తులు కనబరిచే అనేక వర్గాలు భగ్గుమన్నాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు.

పోలీసులు రంగంలోకి దిగి సిసి కెమెరాలను జల్లెడ పట్టి, ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో 23 ఏళ్ళ ఆకాశ్ తల్వార్ అనే యువకుడు తానే చెప్పుల దండ వేసినట్లు అంగీకరించాడు. అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News