Sunday, November 24, 2024

వెల్లుల్లి @400

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నిత్యావసర లైన కూరగాయల ధరలు మళ్లీ నింగినంటుతు న్నాయి. వెల్లుల్లి ఘాటెక్కింది. ఏకంగా కిలో ధ ర రూ.400కు పెరిగిపోయింది. దృఢమైన రె బ్బలతో కూడిన వెల్లుల్లి గడ్డలు మార్కెట్లో కనిపిచంటం లేదు . రైతు బజార్లలో అది కూడా నా సిరకం సరుకే లభిస్తోంది. ఒక వైపు చైనా వె ల్లుల్లి దిగుమతులను అడ్డుకుంటుంటే ..మరోవైపున దేశీయంగా వెల్లుల్లి దిగుమతులు వినియోగానికి సరిపడినంతగా లభ్యతలేదని మా ర్కెట్ వర్గాలు చెబుతున్నాయి.కిలో రూ.150 నుంచి రూ.200కు మించని వెల్లుల్లి ధరలు ఇంతగా పెరిగిపోవటం ఆందోళన గొలుపుతోంది. పుదీనా కట్ట ముట్టుకుంటే షాక్ ఇస్తోం ది. కొత్తిమీర కట్ట కూడా అదే పరిస్థితి. ఆదివా రం రైతు బజార్లలో కొత్తిమిర కట్ట ధర రూ.50 పలికింది. పుంటికూరకు కూడా గిరాకీ పెరిగిం ది.

ఒక్కో కట్ట రెండేసి రెమ్మలతో కలిపి నాలు గు ఒకేకట్టగా చేసి రూ.20చొప్పున విక్రయిస్తున్నారు. అదికూడా తాజాదనంలేని పుంటిఆకు లే దిక్కవుతున్నాయి. ఉల్లిపొరక రూ.45కు చే రింది. ఇతర ఆకు కూరల ధరల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. ఉల్లిగడ్డల ధరలు గత వారం రోజులుగా కిలో రూ.50కి తగ్గటం లేదు.ఇప్పట్లో వీటి ధరలు తగ్గే అవకాశాలు తక్కువే అని వ్యాపారులు చెబుతున్నారు. బయటి మార్కెట్లలో కిలో రూ.55నుంచి రూ.60ధరలో విక్రయిస్తున్నారు. బెంగుళూరు టమటా కిలో రూ.35నుంచి కిందకు దిగటం లేదు. బీన్స్ ధరలు ఏకంగా రూ.150కి చేరిపోయాయి. బ్రాడ్ బీన్స్ రూ.70కి చేరాయి.బీట్‌రూట్ ధరలు కిలో రూ.40కు పెరిగాయి. కాకరకాయలు ధరలు మరింతగా చేదెక్కాయి.

కిలో 30నుంచి రూ.40కి లభించే వీటి ధరలు కిలో రూ.80చొప్పున విక్రయిస్తున్నారు. వంకాయల ధర రూ.40, క్యాబేజి రూ22, కాప్సికం రూ.60చొప్పున పెరిగాయి.. నాశిరకం చిక్కడు కాయల ధరలు కూడా రూ80నుంచి 100కు చేరాయి.క్యారెట్ ధరలు మండిపోతున్నాయి.కిలో రూ.40కి మించిన వీటి ధరలు ఏకంగా రూ.63కు చేరాయి. కాలిఫ్లవర్ రూ.35,ముల్లంగి రూ.60కి పేరిగాయి. అల్లం మరింత ప్రయంగా మారింది. మార్కెట్లకు కొత్త పంట చేరుతున్నా అల్లం ధరలు మాత్రం తగ్గటం లేదు. కిలో రూ.160చొప్పున విక్రయిస్తున్నారు. ఈ సీజన్‌లో ధరల ఘాటు కొంత తగ్గింది అంటే అది పచ్చిమిరప ఒక్కటే కనిపిస్తోంది. నెల కిందట రూ.60నుంచి 80వరకూ ధర పలికిన పచ్చిమిరప మార్కెట్‌లో తెల్లరకం రూ.30,నల్ల రకం మిరప రూ.40కి తగ్గాయి. బెండకాయల ధరలు ప్రేలిపోతున్నాయి. కిలో రూ.25కు మించని వీటి ధరలు ఏకంగా రూ.60కి పేరిగిపోయాయి. పుదీనా కట్ట రూ.72కు పెంచివేశారు. బంగాళదుంపలు కిలో రూ.30, ముల్లంగి రూ.60, పొట్లకాయ రూ.60, చిలగడదుంప రూ.50, టామాటా కిలో రూ.30చొప్పున విక్రయాలు జరిగాయి.

పల్లినూనె రూ.146 :
రైతుబజార్లలో విజయ బ్రాండ్ నూనెల ధరలు లీటరు వేరుశనగ నూనె ప్యాకెట్ రూ.146చొప్పున విక్రయిస్తున్నారు. పొద్దుతిరుగుడు రూ.130, పాయాయిల్ రూ.122, రైస్ బ్రాన్ ఆయిల్ రూ.132, నువ్వుల నూనె రూ.220 ధరలతో విజయ బ్రాండ్ ఔట్‌లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News