Sunday, December 22, 2024

భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలు.. కేజీ ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

కొద్దిరోజులుగా దేశంలో నిత్యవసర వస్తువులు ధరలు పెరుగుతున్నారు. ఇటీవల టమాట, ఉల్లిగడ్డ ధరలు సామాన్య ప్రజలను బెంబేలిత్తించిన విషయం తెలిసందే. ప్రస్తుతం వీటి ధర కొంత తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న సామాన్య జనాలకు ఇప్పుడు వెల్లుల్లి షాకిస్తుంది. దేశంలో వెల్లుల్లి ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో కేజీ వెల్లుల్లి రూ. 400 ధర పలుకుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో రూ.300 నుంచి రూ.400లు ధర పలుకుతుంది.

ఇటీవల దేశంలో కురిసిన భారీ వర్షాలతో పండించిన పంటలు నష్టపోయి దిగుబడి తగ్గింది.దీంతో టమాట, ఉల్లి.. ఇప్పుడు వెల్లులి ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం హోల్​సేల్​ మార్కెట్​లో హై క్వాలిటీ కేజీ వెల్లుల్లి ధర రూ.220 నుంచి రూ.250లు పలుకుతుండగా… మామూలుగా ఉన్న వెల్లుల్లి కేజీ ధర రూ.130 నుంచి రూ.140గా ఉంది. ఇలా వరుసగా నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతుండడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక, కార్తికమాసం కారణంగా నిన్నమొన్నటి వరకు పడిపోయిన చికెన్ ధరలు రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకావం ఉంది. ఈరోజు గుడ్డు ధర కూడా కొండెక్కి కూర్చుంది. మార్కెట్ లో ఒక్కో గుడ్డు ధర రూ.7 పలుకుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News