Saturday, December 21, 2024

హైదరాబాద్ లో గార్మిన్ ఇండియా అతిపెద్ద ఇండియన్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గార్మిన్ లిమిటెడ్ యొక్క ఒక యూనిట్ అయిన గార్మిన్ ఇండియా (NASDAQ: GRMN), ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ ప్రాంతంలో దాని అతిపెద్ద ఇండియన్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్ యొక్క గ్రాండ్ ఓపెనింగ్ గురించి ప్రకటన చేసినది. పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్ కు సేవలందించడానికి విస్తృత శ్రేణి గార్మిన్ ఉత్పత్తులు, సేవలను అన్వేషించడం, పొందడం కోసం వినియోగదారులకు ఒక చక్కని అవకాశాన్ని అందించడమే ఈ కొత్త స్టోర్ యొక్క లక్ష్యం. 540 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించబడిన ఈ స్టోర్ కస్టమర్ ఇంటరాక్షన్, ఎంగేజ్మెంట్ ను మెరుగుపరుచుట, ఒక పరిపూర్ణమైన, లీనమయ్యే రిటైల్ వాతావరణాన్ని అందించడం పట్ల గార్మిన్ యొక్క నిబద్ధతకు నిదర్శనం అవుతుంది.

హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక బంజారా హిల్స్ ప్రాంతంలో షాప్ నంబర్ 8-2-626/3/AG5, MS టవర్స్, రోడ్ నంబర్ – 1 లో కొత్త ఎక్స్‌పీరియెన్స్ స్టోర్ ఘనంగా ప్రారంభించబడినది. అత్యాధునికమైన సాంకేతికత, నిష్కళంకమైన సేవ ద్వారా తమ వినియోగదారుల జీవితాలను సుసంపన్నం చేయుటలో గార్మిన్ యొక్క ఈ ప్రయాణంలో ఈ స్టోర్ ప్రారంభం అద్భుతమైన అధ్యాయంగా నిలుస్తుంది.

“ఇప్పటివరకు మా అతిపెద్ద స్టోర్ ను ఇక్కడ హైదరాబాద్ లో ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన ఘనత భారతదేశం పట్ల మా యొక్క నిబద్ధతను, భారత మార్కెట్ యొక్క సామర్థ్యం పట్ల మా ప్రగాఢమైన విశ్వాసాన్ని సూచించును. మా విలువైన వినియోగదారులకు వినూత్నమైన ఉత్పత్తులను అందించడం, వారితో బలమైన బంధాలను ఏర్పరుచుకోవడం పట్ల మా అంకితభావాన్ని ఈ స్టోర్ ప్రతిబింబిస్తుంది.” అని స్కై చెన్, రీజినల్ డైరెక్టర్, గార్మిన్ ఏషియా, అండ్ సౌత్ఈస్ట్ ఏషియా గారు కొత్త స్టోర్ ప్రారంభించుట పట్ల తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు.

యూజర్స్ నుండి అద్భుతమైన సానుకూల స్పందనను పొందడం ద్వారా, అధునాతనమైన వియరెబుల్స్ కోసం గల బలమైన డిమాండ్ ద్వారా అన్ని కేటగిరీలలో వృద్ధితో పాటు, గార్మిన్ యొక్క రెండవ త్రైమాసిక నివేదిక 2023 ప్రకారం ఫిట్‌నెస్ రంగంలో గార్మిన్ రెండవ త్రైమాసికంలో 23% వృద్ధిని నమోదు చేసినది. ఈ సంవత్సరం ఈ విశేషాలకు అదనంగా గార్మిన్ ఇటీవలే ఏఎంవోఎల్ఇడి స్క్రీన్, బిల్ట్-ఇన్ ఎల్ఇడి ఫ్లాష్‌లైట్ తో ప్రముఖ ఎపిక్స్ ప్రో సిరీస్ స్మార్ట్‌వాచ్ లను విస్తృత శ్రేణి వినియోగదారులకు సరిపోయేలా 3 సైజ్ వేరియంట్ లతో ప్రవేశపెట్టినది.

కొత్తగా ప్రారంభించబడిన స్టోర్ ఫిట్‌నెస్, ఔట్‌డోర్, వెల్‌నెస్ సహా వివిధ కేటరిగీల వ్యాప్తంగా గార్మిన్ స్టార్ట్ వాచెస్ యొక్క విస్తృతమైన శ్రేణిని కలిగి ఉంది. ఇటీవల ప్రారంభించిన ఫెనిక్స్ 7 ప్రో, ఎపిక్స్ ప్రో సిరీస్ అలాగే ఇన్‌స్టింక్ట్ 2X సోలార్, ఫోర్‌రన్నర్ 965/265, అప్రోచ్ ఎస్70 వంటి ప్రముఖ ఉత్పత్తులను ఈ కలెక్షన్ కలిగి ఉన్నది, ఇది వినియోగదారులు వారికి ఖచ్చితంగా సరిపోయే వాటిని కనుగొనేందుకు వీలు కల్పిస్తుంది. అదనంగా, ఉత్పత్తి ఫీచర్స్ అర్థం చేసుకోవడంలో, సమాచారంతో కూడిన ఎంపికలు చేసుకోవడంలో వ్యక్తిగతీకరించబడిన మార్గదర్శనం, మద్దతును అందించడానికి జిబిఎస్ యొక్క నిపుణుల బృందం అందుబాటులో ఉంటుంది.

ఈ ప్రారంభంతో, పుణే, ఢిల్లీ ఎన్‌సిఆర్, బెంగుళూరులోని 2 స్టోర్స్ తో కలిపి గార్మిన్ యొక్క మొత్తం బ్రాండ్ స్టోర్స్ సంఖ్య 5కు పెరిగినది. హిలియోస్ వాచ్ స్టోర్, జస్ట్ ఇన్‌టైమ్, క్రోమా, ఇతర ముఖ్యమైన సైక్లింగ్, స్పోర్ట్స్ స్టోర్స్ వంటి ఆఫ్‌లైన్ ఛానెల్ భాగస్వాముల ద్వారా, అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా లగ్జరీ, టాటా క్లిక్, నైకా, Bhawar.com, Synergizer.com వంటి ఇ-కామర్స్ భాగస్వాముల ద్వారా కూడా గార్మిన్ ఇండియా తన అమ్మకాలను నిర్వహిస్తున్నది.

నగరంలోని ప్రధాన ప్రాంతంలో, విశాలమైన విస్తీర్ణంలో గార్మిన్ స్టోర్ ప్రారంభించడం అనేది వినియోగదారులకు సౌకర్యవంతమైన, ఎంగేజింగ్ షాపింగ్ అనుభవాన్ని అందించే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుంది. స్వాగత సూచనగా వినియోగదారులు స్టోర్ వద్ద కింది ఆఫర్స్ పొందవచ్చు:

· 29 ఆగస్ట్ నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ప్రారంభోత్సవ ఆఫర్ గా 15% ప్రత్యేక తగ్గింపు. ఫెనిక్స్ 7 ప్రో, ఎపిక్స్ ప్రో, ఫోర్‌రన్నర్ 265, ఫోర్‌రన్నర్ 965 పై మినహా

· ప్రతి ఫెనిక్స్ 7 ప్రో, ఎపిక్స్ ప్రో, ఫోర్‌రన్నర్ 265, లేదా ఫోర్‌రన్నర్ 965 కొనుగోలు పై వినియోగదారులు కాంప్లిమెంటరీ జిఆర్‌సి రన్నింగ్ జెర్సీని కూడా పొందవచ్చు. ఈ పరిమిత ఆఫర్స్ మొదట వచ్చిన వారికి మొదట అందించే క్రమంలో పొందవచ్చు.

గార్మిన్ ఇండియా యొక్క అతిపెద్ద ఇండియన్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్ ను ప్రారంభించుకున్న గొప్ప మైలురాయిని చేరుకున్న వేడుకలతో పాటు, కంపెనీ అద్భుతమైన, మెరుగైన కస్టమర్ ఇంటరాక్షన్స్ కోసం, శాశ్వత సంబంధాలను పెంపొందించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటుంది. అసమానమైన ఉత్పత్తులు, సేవలను అందించేందుకు ధృడమైన నిబద్ధతతో హైదరాబాద్ లోని గార్మిన్ యొక్క బంజారా హిల్స్ స్టోర్ అందరి కోసం ఆవిష్కరణలు, జ్ఞానాన్ని పంచుకునే, సంతోషకరమైన అనుభవాల కేంద్రంగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News