- Advertisement -
తిరుపతి: తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నేడు విశిష్టమైన గరుడ సేవ జరుగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి మలయప్పస్వామి రూపంలో గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది భక్తులు పోటెత్తారు. దాంతో తిరుమాడ వీధులు ఇసుకవేస్తే రాలనంతగా భక్త జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. గరుడ వాహన సేవను భక్తులందరూ వీక్షించేందుకు వీలుగా, టిటిడి తిరుమల అంతటా భారీ ఎలక్ట్రానిక్ తెరలను ఏర్పాటు చేసింది.
- Advertisement -