తిరుపతి: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శుక్రవారం ఉదయం పది గంటల వరకు మోహినీ అవతారం ఉంటుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమవుతోంది. గరుడ వాహనాన్ని మూల విరాట్ ఆభరణాలు అలంకరించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశిష్టమైన గరుడ వాహన సేవ ఉంటుంది. ఏడాదిలో గరుడోత్సవం నాడు మాత్రమే ఆభరణాలు గర్భాలయం దాటి రానున్నాయి.
అందుకే గరుడ వాహనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గ్యాలరీలో రెండు లక్షల మంది వాహనసేవ తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలను రద్దు చేశారు. పార్కింగ్‌కు ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేశారు. 15 వేల వాహనాల పార్కింగ్‌కు తిరుమలలో అవకాశం ఉంది. 15 వేల వాహనాలు దాటితే తిరుపతిల్లోనే పార్క్ చేసుకోవాలని టిటిడి అధికారులు సూచించారు. విలువైన వస్తువులు తీసుకరావద్దని భక్తులకు పోలీసులు సూచించారు.
ఐదు వేల మంది పోలీసులు, 1800 టిటిడి విజిలెన్స్‌తో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు.
Also Read: మహిళా ఎస్‌ఐకి వేధింపులు: ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్