Wednesday, January 22, 2025

సిలిండర్ కు మొత్తం డబ్బు కట్టాల్సిందే!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహా లక్ష్మీ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన ఈ నేపథ్యంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కూడా ఈ పథకం కింద తీసుకరావాలని ప్రయత్నిస్తోంది. లబ్ధిదారులు గ్యాస్ తీసుకున్నప్పుడు పూర్తిగా డబ్బులు చెల్లించాల్సిందేనని పౌరసరపరాల శాఖ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ తీసుకున్న తరువాత ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వినియోగదారుడు ఎకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.40 రాయితీని పరిగణనలోకి తీసుకోనుంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.955 ఉంటే లబ్ధిదారులు రూ.500 చెల్లిస్తే, కేంద్ర రాయితీ రూ.40, రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కింద రూ.415 జమ చేయనుంది.

ఉజ్వల గ్యాస్ కనెక్షన్ రాయితీ పోను మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. గ్యాస్ ధరలు హైదరాబాద్‌లో రూ.955, సూర్యాపేటలో రూ.974, మహబూబ్‌నగర్‌లో రూ.958, నారాయణ పేటలో రూ.973 ఉన్నాయి. రవాణా ఛార్జీలు వ్యత్యాసం కారణంగా తెలంగాణలో ఒక్కో ప్రాంతాలలో ఒక్కో విధంగా ధరలు ఉన్నాయి. తెలంగాణలో 11.58 ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి, హైదరాబాద్‌లో గ్యాస్ ధర రూ.955 ఉంటే ఉజ్వల కనెక్షన్ల వినియోగదారులకు కేంద్రం ప్రభుత్వం రూ.340 రాయితీ ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.115 జమ చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News