Monday, January 20, 2025

గ్యాస్ సిలిండర్ పేలి టీ స్టాల్ దగ్ధం

- Advertisement -
- Advertisement -

గ్యాస్ సిలిండర్ పేలి టీస్టాల్ పూర్తిగా దగ్దమై సు మారు 8 లక్షల ఆస్తినష్టం జరిగిన సంఘటన మండలం బొడ్మట్‌పల్లిలో చో టు చేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండల పరిదిలోని బొడ్మట్‌పల్లిని అనుకొని జాతీయ రహదారి వద్ద చాయ్ దునియా బ్రాంచ్ పేరుతో సుమారు పది లక్షల పెట్టుబడితో టీ స్టాల్‌ను నిజాంపేట గ్రామానికి చెందిన మంగళి కన్నబాబు అనే వ్యక్తి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మద్యాహ్నం టీ పెడుతున్న గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు వచ్చాయి. అవి అర్పే ప్రయత్నం చేసిన మంటలు అదుపు కాలేదు. ఆ అగ్ని ప్రమాదాన్ని చూడటానికి వచ్చిన బొడ్మట్‌పల్లి తలారి నర్సింలుకు ఆ మంటలు తాకి వీపు భాగంలో గాయమైంది.

ఆయనను సంగారెడ్డి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. మంటలు అదుపుకాకపోవడంతో అగ్నిప్రమాద సిబ్బందికి సమాచా రం ఇవ్వడంతో సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పేశారు. సంఘటన స్థలానికి రెవెన్యూ శాఖ అధికారి సాయిశ్రీకాంత్ జరిగిన ప్రమాదంపై పంచనామా నిర్వహించారు. నష్టపోయిన తమను ప్రభుత్వాన్ని ఆదుకోవాలని టీస్టాల్ నిర్వాహకులు కన్నబాబు కుటుంబీకులు బోరున విలపిస్తూ అధికారిని వేడుకున్నారు. నష్టపరిహార విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News