- Advertisement -
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం దక్షిణా పరగణాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పథార్ ప్రతిమ బ్లాక్ లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ధోలాఘాట్ గ్రామంలో కుటుంబం ఇంట్లో బాణాసంచా ఫ్యాక్టరీ నిర్వహిస్తోంది. ఇంట్లో నుంచి గత రాత్రి భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. గ్రామస్థుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఆ ఇంట్లో 11 మంది ఉండేవారని ఏడు మృతదేహాలు లభించాయని పోలీసులు పేరకన్నొరు. మిగిలిన వారి ఆచూకీ తెలియలేదన్నారు. గ్యాస్ సిలిండర్ పేలడంలో మంటలు వ్యాపించాయని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -