Thursday, January 23, 2025

పేలిన గ్యాస్ సిలిండర్..తప్పిన ప్రాణ నష్టం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధవారం గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన చోటు చేసుకుంది.దుర్గా నగర్‌లో జరిగిన ఈ ఘటనలో అందరూ సురక్షితంగా బయట పడగా సిలిండర్ పేలుడు దాటి ఇంటి గోడలు కూలిపోయ్యాయి. గత 6 నెలల క్రితం బతుకుతెరువు కోసం బీహార్ నుండి కాటేదానికి వచ్చిన రవి రంజన్ కుమార్ కుటుంబం దుర్గ నగర్‌లో ఉంటున్నారు.ఈ ఇంట్లో రవిరంజన్ కుమార్‌తో పాటు అతని భార్య అస్మర్తి,6 నెలల పాప నివసిస్తుంది.

Also Read:  బస్సు బోల్తా..15 మందికి తీవ్ర గాయాలు

అస్మతి కుమారి వంట చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా సిలిండర్ కు అంటుకుని మంటలు రావడంతో ఆమె బయటికి పరుగులు తీశారు. ఆ తర్వాత సిలిండర్ పేలిపోవడం, బాంబు బ్లాస్ట్‌లా పెద్ద చప్పుడు రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి హూటాహుటిన చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే బుధవారమే హెచ్ పి సిలిండర్‌ను కుటుంబం తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News