- Advertisement -
న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల ముగియనుంది. రేపటి నుంచి మే నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల మొదటి తేదీన అనేక మార్పులు ఉంటాయి. మే 1 నుంచి కూడా చాలా మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు నేరుగా వినియోగదారుల జేబుపై ప్రభావం చూపనున్నాయి. ప్రభుత్వం అనేక నియమాలను మార్చబోతోంది. ఇందులో జిఎస్‌టి నియమాలు వంటివి ఉన్నాయి.
గ్యాస్ సిలిండర్ ధర
ప్రతి నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ రేటు కూడా మారుతుంది. ఎల్‌పిజి వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఏప్రిల్‌లో తగ్గించారు. కంపెనీలు ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.92 వరకు తగ్గించాయి. ఢిల్లీలో సిలిండర్ తగ్గింది. ఢిల్లీలో వాటి ధరల్లో ఏడాదిలో రూ.225 ఉపశమనం లభించింది.
- Advertisement -