ఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నారీమణులకు కానుక ఇచ్చారు. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని మోడీ తన ట్వీట్టర్ లో ట్వీట్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా సిలిండర ధర తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని, ఈ ప్రకటన నారీ శక్తికి ప్రయోజనం చేకూరుతుందని మోడీ తెలిపారు. కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడానికే గ్యాస్ ధర తగ్గించామని వివరించారు. మహిళల సాధికారత, సులభతర జీవన విధానాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నామని, కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని మోడీ తెలియజేశారు.
ఉజ్వల యోజన కింద ఎల్‌పిజి సిలిండర్‌పై ఇచ్చే రాయితీని రూ.300 వచ్చే సంవత్సరం వరకు పొడగిస్తున్నట్టు కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. గతం సంవత్సరం రక్షా బంధన్ సందర్భంగా సిలిండర్ ధర రూ.200 తగ్గించిన విషయం విధితమే.