Monday, January 20, 2025

మహానది బేసిన్ బ్లాక్‌లో రెండు గ్యాస్ నిల్వలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, సహజవాయువుల సంస ్థ(ఒఎన్‌జిసి)బంగాళాఖాతంలోని మహానది బేసిన్‌లో రెండు చోట్ల పెద్ద మొత్తంలో సహజవాయు నిల్వలను కనుగొనింది. 2019లో ప్రభుత్వం ఓపెన్ ఏకరేజ్ లైసెన్సింగ్ విధానంలో భాగంగా జరిపిన మూడవ బహిరంగ వేలంలో దక్కించుకున్న ఎంఎన్ డిడబ్యుల్య హెచ్‌పి 2018/1 బ్లాక్‌లో ఒఎన్‌జిసి ఈ సహజవాయు నిల్వలను కనుగొనింది. జాతీయ భద్రతా కారణాల దృష్టా గతంలో‘ నో గో’ (ఎలాంటి అన్వేషణలు జరపకూడని) ఏరియాగా వర్గీకరించిన ప్రాంతంలోనే ఒఎన్‌జిసి ఈ నిల్వలను కనుగొనడం గమనార్హం.

ఉక్తల్‌గా పిలవబడే తొలి అన్వేషణ నీటిలోపల714 మీటర్ల లోతులో కనుగొనబడింది. ప్రాథమిక టెస్టింగ్ సమయంలో రోజుకు 3 లక్షల ఘనపు మీటర్లకన్నా ఎక్కువ గ్యాస్ ప్రవాహాన్ని కలిగి ఉంది. ఇక రెండోది నీటిలోపల 1100మీటర్ల లోతులో కనుగొనబడింది. ఒన్‌జిసి ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రో కార్బన్స్ (డిజిహెచ్)కు తెలియజేసింది. అలాగే ఇప్పుడు వాణిజ్యపరంగా లాభదాయకమా కాదా అనే విషయాన్ని అంచనా వేసే ప్రక్రియను చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News