గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగడంతో ఆరుగురికి గాయాలైన సంఘటన కోకాపేటలోని గర్ టవర్2లో శనివారం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం…గర్ టవర్2లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. రెస్టారెంట్‌లో గ్యాస్ లీక్ కావడంతో యజమాని, అందులో పనిచేస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. రెస్టారెంట్‌లో కొత్తగా నిర్మాణ పనులు చేస్తుండడంతో అక్కడ గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలకు రెస్టారెంట్ అద్దాలు పగిలిపోయాయి. మంటలకు రెస్టారెంట్ యజమాని, ఇద్దరు వర్కర్లు, ఇద్దరు కన్‌స్ట్రక్షన్ వర్కర్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అగ్నిప్రమాదం విషయం తెలియడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి వెంటనే మంటలనున ఆర్పివేశారు. సంఘటన స్థలానికి నార్సింగి ఎసిపి రమణగౌడ్, ఇన్స్‌స్పెక్టర్ తదితరులు పరిశీలించారు.