Wednesday, January 22, 2025

బాల్టిక్ సముద్రంలో గ్యాస్ లీకేజీ పేలుళ్లు

- Advertisement -
- Advertisement -

Gas leakage explosions in the Baltic Sea

స్టాక్‌హోం: స్వీడన్‌కు దక్షిణ దిశలో బాల్టిక్ సముద్ర గర్భంలో నార్డ్ స్ట్రీమ్ పైపులైన్‌లో నాలుగవ సారి లీకేజి సంభవించింది. స్వీడన్‌లో రెండు చోట్ల గ్యాస్ పైపులైనులో లీకేజీలు ఏర్పడినట్లు స్వీడన్ కోస్తా గార్డు ప్రతినిధి మాటియాస్ లిండ్‌హోమ్ తెలిపారు. డెన్మార్క్‌లోని సముద్ర గర్భంలో రెండు చోట్ల గ్యాస్ లీకేజీలు ఏర్పడినట్లు ఆయన చెప్పారు. ఇటీవల గ్యాసు సరఫరాను నిలిపివేసిన నార్డ్ స్ట్రీమ్ 1 పైపులైనులో రెండు చోట్ల, ఇంకా నిర్వహణ మొదలుకాని నార్డ్ స్ట్రీమ్ 2 పైపులైనులో రెండు చోట్ల లీకేజీలు ఏర్పడినట్లు ఆయన చెప్పారు. ఇవి ప్రస్తుతం నిర్వహణలో లేనప్పటికీ రెండు పైపులైనుల్లో గ్యాస్ నిండి ఉన్నట్లు ఆయన చెప్పారు. రష్యా నుంచి జర్మనీకి గ్యాసును రవాణా చేయడానికి బాల్టిక్ సముద్రంలో నిర్మించిన నార్డ్ స్ట్రీమ్ పైపులైనులు పనిచేస్తాయి. అయితే, ఈ లీకేజీలు ఉద్దేశపూర్వకంగా జరిగినవని డ్యానిష్, స్వీడిష్ ప్రభుత్వాలు అనుమానిస్తున్నాయి. లీకేజీలు జరగడానికి ముందు డ్యానిష్ దేశానికి ఆగ్నేయ దిశలో ఉన్న బార్న్‌హోం దీవిలోకి సమీపంలో సముద్రగర్భంలో మొదటి పేలుడు సంభవించింది. రెండవ పేలుడు అదే దీవికి ఈశాన్య దిశలో సముద్రగర్భంలో సంభవించిందని, ఇది రిక్టర్ స్కేలుపై 2.3గా నమోదైందని డెన్మార్క్, నార్వే, ఫిన్‌ల్యాండ్‌లోని భూకంప పరిశోధనా కేంద్రాలు తెలిపాయి.ఇంధన ధరలు పెరగడంతోపాటు ఐరోపా దేశాలలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్నందున ఈ పేలుళ్ల వెనుక రష్యా హస్తం ఉండవచ్చని కొందరు ఐరోపా అధికారులు అనుమానిస్తున్నారు.
==

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News