- Advertisement -
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. లంకలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గ్యాస్ ధర ఒక్కసారిగా రూ.1000 నుంచి 5500 రూపాయలకు పెరిగింది. లంక వాసులు గ్యాస్ సిలిండర్ల కోసం కొట్టుకున్నారు. శ్రీలంకలో భద్రతా బలగాలు ఎమర్జెన్సీ ప్రకటించాయి. దేశ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించడంలో విఫలమయ్యారనే జనాగ్రహం వెల్లువెత్తడంతోపాటు కొలంబోలోని అధ్యక్ష భవనంలోకి ప్రజలు చొరబడటంతో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సా సైనిక విమానం ఎఎన్ 32లో బుధవారం మాల్దీవులకు పారిపోయిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆయన సింగపూర్‌కు వెళ్లుతారని వెల్లడైంది. పదవి నుంచి దిగిపోవడానికి కొద్ది గంటల ముందు ఆయన దేశం వీడి వెళ్లినట్లు నిర్థారణ అయింది.
- Advertisement -