Tuesday, January 21, 2025

మళ్లీ గ్యాస్ ధర పెంచిన మోడీ… శుభాకాంక్షలు చెప్పిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Gas rate increased by Modi

హైదరాబాద్: మంత్రి కెటిఆర్ ఎప్పటికప్పుడు బిజెపిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. బిజెపితో ఢీ అంటే ఢీ అనే విధంగా కామెంట్లు చేస్తున్నారు. బిజెపిపై విమర్శలు చేయడంలో కెటిఆర్ దూకుడు పెంచారు. తాజాగా గ్యాస్ బండపై యాబై రూపాయలు ధర పెంచడంతో కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మంచి రోజులు వచ్చేశాయా (అచ్చెదిన్ ఆగాయా) అందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సిలిండర్ ధర పెంచి మహిళలకు కానుకగా ఇచ్చారని దుయ్యబట్టారు. సిలిండర్ ధర రూ.1055 నుంచి రూ.1105 కు పెరిగింది. దేశంలో పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News