Monday, December 23, 2024

గ్యాస్ రీఫిలింగ్‌కు పాల్పడుతున్న ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : గ్యాస్ సీలిండర్ల రీఫిలింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును బాలనగర్ ఎస్‌ఓటి పోలీసులు రట్టు చేశారు. వంట గ్యాస్ సీలిండర్ల నుంచి నుంచి అక్రమంగా కమర్షియల్ సీలిండర్లలోకి గ్యాస్ రీఫిలింగ్ చేసి అధిక ధరలకు విక్రయస్తున్న మొత్తం 6 మందిని అరెస్టు చేసిన పోలీసులు భారీగా గ్యాస్ సీలిండర్లను సీజ్ చేయడంతోపాటు కేసు నమోదు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో ఓ ముఠా వంట గ్యాస్ సీలిండర్ల నుంచి గ్యాస్‌ను కమర్షియల్ సీలిండర్లోకి అక్రమంగా రీఫింలింగ్ చేస్తున్న సమాచారం అందడంతో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి బాలానగర్ ఎస్‌ఓటి బృందం జరిపిన దాడుల్లో 6 మంది పట్టబడ్డట్లు వెల్లడించారు.

ఈ దాడుల్లో జి. శివ (34), ఎన్. నరేష్(7), బి. సురేష్(35), జి.మహేష్(28), ఎస్.నాగరాజు(39), ఎస్.కార్తీక్(21)లను అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుంచి 67 డొమెస్టిక్, 190 కమర్షియల్ సీలిండర్లతో పాటు 5 ట్రాన్స్‌పోర్టు వాహనాలు, 4వెయింగ్ మిషన్లు, 26 ఫిలింగ్‌పైపులు, 6 మొబైల్ ఫోన్లు మొత్తం రూ.10.50 లక్షల విలువ గల వస్తువులు సీజ్ చేయడంతోపాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News