Monday, January 20, 2025

39.33లక్షల మందికి గ్యాస్ రాయితీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలువ చేస్తున్న మహాలక్ష్మి వంటగ్యాస్ పథకానికి అనుహ్య స్పందన లభించింది. ఈ పథకం కింద రూ.500కు వంటగ్యాస్ రాయితీ కింద ఇప్పటివరకూ 18.86లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని ఉపయోగించుకున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.

ఈ పథకం కింద ఈ నెల 13నాటికి 21.29లక్షల మందికి రూ.59.97కోట్లు సబ్సిడీ ఇచ్చినట్టు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 39.33లక్షల మంది గ్యాస్‌వినియోగదారుల రూ.500కు సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించినట్టు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News