అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి బొల్తా కొట్టింది. ట్యాంకర్ నుండి గ్యాస్ లీక్ అవుతుందని వాహనాదారులు భయాందోళనతో పరుగులు తీశారు. రోడ్డుకు అడ్డంగా ట్యాకర్ బోల్తా కొట్టడంతో కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పాడి వాహనాలు భారీగా నిలిచిపోయిన్నాయి. ట్యాంకర్ డ్రైవర్‌కు గాయాలు కావడంతో అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం…గుజరాత్ నుండి టిఎన్ 88జె0366 నంబర్ గల ఎల్పీజి గ్యాస్ ట్యాంకర్ చైన్నెకి బయలుదేరింది. పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్ రాగానే విజయవాడ జాతీయ రహదారిపై గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి డివైండర్‌ను ఢికొట్టి బోల్తా కొట్టింది. పోలీసులు సహాయక చర్యలు తీసుకున్నారు. భారీ గ్యాస్ ట్యాంకర్ జాతీయ రహదారిపై అడ్డంగా పడిపోవడంతో పక్కకు తరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గ్యాస్ లీక్ కాకుండా చర్యలు తీసుకున్నారు.