Thursday, January 9, 2025

అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ‘హానర్ సిగ్నాటిస్’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హానర్ హోమ్స్ తన నాలుగో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ‘హానర్ సిగ్నాటిస్’ను ఆవిష్కరించింది. హానర్ ప్రైమ్ హౌసింగ్ ప్రమోటర్ డైరెక్టర్ బాలు చౌదరీ ప్రకారం, హానర్ సిగ్నాటిస్‌ను 28.4 ఎకరాల్లో 78 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3,266 అపార్ట్‌మెంట్లతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే గత ప్రాజెక్టులలో దాదాపు 32 లక్షల చదరపు అడుగులు డెవలప్‌మెంట్ పూర్తి చేయగా, ప్రస్తుతం నగరం మధ్యలో కూకట్‌పల్లి ఐడిఎల్ లేక్ సమీపంలో 56 ఎకరాల విస్తీర్ణం గల అతిపెద్ద స్థలంలో 12 లక్షల చ.అడుగులు కల్గిన లగ్జరీ విల్లా ప్రాజెక్టు ‘హానర్ రిచ్ మాంట్’, ఇది 28.4 ఎకరాల్లో నిర్మాణంలో ఉంది.

ఇప్పుడు మిగిలిన 27.5 ఎకరాల విస్తీర్ణంలో 78 లక్షల చ.అడుగుల నూతన ప్రాజెక్టును ఈ నెల 19వ తేదీన కూకుట్‌పల్లి హైటెక్ సిటీ సమీపంలో ఐడిఎల్ రోడ్ నందు గల ప్రాజెక్ట్ సైట్ ఆఫీస్ వద్ద కస్టమర్ల సమక్షంలో అట్టహాసంగా లాంచ్ చేయబోతున్నామని సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్ – డైరెక్టర్లు పి.వెంకటేశ్వర్లు, ఎం.బాలు చౌదరి, వై.స్వప్నకుమార్, ఎస్.రాజమౌళితో సహా సంస్థ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, హైదరాబాద్ నడి మధ్యన 27.5 ఎకరాల అతి పెద్ద విస్తీర్ణం గల హానర్ సిగ్నాటిస్ ప్రాజెక్ట్ మొత్తం 18 టవర్లతో, 3 లెవెల్ పార్కింగ్, జి+25 ఫ్లోర్లతో అలాగే 2 క్లబ్ హౌసులతో నిర్మాణం జరుగుతున్నదని అన్నారు.

దీనిలో 1,695 నుండి 2,160 చ.అడుగుల 3బిహెచ్‌కె అపార్ట్‌మెంట్లు, 2,475, 2,875 స్టడీ రూమ్ కలిగిన 3.5 బిహెచ్‌కె అపార్టుమెంట్లతో పాటు ప్రత్యేకంగా లాబీ, మెయిడ్ రూమ్ కలిగిన 3,815 చ. అడుగులతో ఒక ఫ్లోర్‌కు నాలుగు మాత్రమే కలిగి, అన్నీ కార్నర్ ఫ్లాట్లతో నాలుగు ఎక్సక్లూసివ్ 4బిహెచ్‌కె టవర్స్ నిర్మిస్తున్నామని అన్నారు. ప్రాజెక్టు మొత్తం 3,266 అపార్టుమెంట్లతో నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు. హానర్ సిగ్నాటిస్‌లో మొత్తం 1 లక్ష 31 వేల చ. అడుగుల పైగా ఉన్న రెండు క్లబ్ హౌసుల నిర్మాణం జరుగుతున్నది. ఒక క్లబ్ హౌస్ మొత్తం క్రీడలు, ఫిట్ నెస్ ప్రాధాన్యంగా డిజైన్ చేశారు. విశేషం ఏమిటంటే ఈ స్పోర్ట్ క్లబ్ హౌస్‌లో పురుషులు, స్త్రీలకు విడివిడిగా 20,000 చ.అడుగులతో రెండు అతి పెద్ద జిమ్‌లు, అలాగే రెండో క్లబ్ హౌస్‌లు, ఫంక్షన్ హాల్స్, క్లినిక్, లాకర్లతో కూడిన బ్యాంకు, సూపర్ మార్కెట్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఇంకో ప్రత్యేకత ఎకరాలకు పైగా ఉన్న సెంట్రల్ ఓపెన్ పార్క్ ఏరియా ఇంకా వెహికల్ ఫ్రీ పోడియం ఏరియా ఉన్నాయని ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News