Monday, December 23, 2024

రాధిక బత్రాకు గేట్స్ పురస్కారం

- Advertisement -
- Advertisement -

Gates Award to Radhika Batra

న్యూయార్క్: చెందిన రాధిక బత్రా, అఫ్గానిస్థాన్‌కు చెందిన జహ్రా జోయ, ఉగండాకు చెందిన వనీసా నకాటే, ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లెయన్‌లకు బిల్ అండ్ మెలిండా గేట్స్ పురస్కారం లభించింది. యూఎన్ సస్టెయిన్‌బుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డిజిఎస్) కోసం చేసిన విశేష కృషికి గేట్స్ పురస్కారాన్ని అందజేశారు. న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పురస్కార గ్రహీతలకు గోల్‌కీపర్స్ గ్లోబల్ అవార్డును అందజేశారు. కాగా భారత్‌కు చెందిన రాధిక బత్రా సంస్థ ఇన్‌ఫాంట్ మ్యాటర్స్‌కు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. భారత్‌లోని చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణకు రాధిక చేసిన గుర్తింపునకు ప్రతిఫలంగా గేట్స్ పురస్కారం లభించింది. అవార్డు విజేతల్లో ఒకరైన జహ్రా అఫ్గానిస్థాన్‌కు చెందిన జర్నలిస్ట్ ఈమె ఆన్‌లైన్ వార్తా సంస్థ మీడియాను స్థాపించి అఫ్గాన్ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. ఉగండాకు చెందిన వసీనా వాతావరణ ఉద్యమకారిణి. వసీనా ఆఫ్రికా కేంద్రంగా గ్రీన్‌స్కూల్స్ ప్రాజెక్టు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు వాన్ డెర్ తమ ప్రాంతంలో శాంతి భద్రతలు పెంపొంచేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా గేట్స్ పురస్కారాన్ని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News