Wednesday, November 20, 2024

పేదరికం, సామాజిక అసమానతల నివారణకు బిల్‌గేట్స్ భారీ ఆర్థికసాయం

- Advertisement -
- Advertisement -

Gates Foundation $1.27 billion in financial aid

గోల్‌కీపర్స్ సమావేశంలో తాజాగా రూ. 1.27 బిలియన్ డాలర్ల సాయం వెల్లడి

న్యూయార్క్ : సామాజిక శ్రేయస్సు కోసం అనేక సార్లు ముందడుగు వేసి భారీ నిధులను అందించిన బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఈసారి కూడా తన దాతృత్వాన్ని చూపించింది. పేదరికాన్ని, సామాజిక అసమానతలను ఎదుర్కొనేందుకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ దాదాపు 1.27 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని తాజాగా ప్రకటించింది. మన కరెన్సీలో చెప్పుకుంటే దీని విలువ దాదాపు రూ. 10 వేల కోట్లు ఉంటుంది. ఈ సహాయం ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవి, క్షయ, మలేరియా వ్యాధులతో బాధపడుతున్న దాదాపు 20 మిలియన్ మందిని రక్షించడానికి, భవిష్యత్తులో ఎదురయ్యే కరోనా వంటి మహమ్మారి వ్యాధులను ఎదుర్కొనే పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలను నెలకొల్పడానికి, 2030 నాటికి ఈ వ్యాధులను నివారించి తిరిగి ప్రపంచాన్ని పురోగతిలో నిల్పడానికి ఉపయోగిస్తారు. రెండు రోజుల పాటు జరిగిన గోల్ కీపర్స్ కార్యక్రమం ముగింపులో ఫౌండేషన్ ఈ ప్రకటన చేసింది.

న్యూయార్క్ లోని లింకన్‌సెంటర్‌లో రెండు రోజుల పాటు గోల్‌కీపర్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బార్బడోస్ ప్రధాని మియా మోట్లీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సంచెజ్, బిల్‌గేట్స్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్ ప్రతినిధులు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 300 మంది యువకులు పాల్గొన్నారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తన వార్షిక గోల్‌కీపర్స్ నివేదికలో యుఎన్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్‌కు సంబంధించిన దాదాపు ప్రతి సూచిక 2030 నాటికి సాధించడానికి వీలు లేకుండా ఉందనే విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో గేట్స్ ఫౌండేషన్ ఈ భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించడం గమనార్హం. పేదరికం, అసమానతలు , వాతావరణ మార్పులు సహా ఎప్పటినుంచో ఉన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలు కనుగొనాల్సి ఉందని, వినూత్నమైన విధానాలతో పెట్టుబడి పెట్టడం ద్వారా పురోగతిని వేగవంతం చేసే అవకాశాలను అందిపుచ్చుకోవాలని నివేదిక వెల్లడించింది. మనం ఎదుర్కొంటున్న సవాళ్లను, వాటి పరిష్కారాలకు చేయవలసిన స్థిరమైన వాగ్దానాల ఆవశ్యకతను ఈ వారం సూచించిందని గేట్స్ ఫౌండేషన్ సిఇఒ మార్క్ సుజ్‌మాన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News