Wednesday, January 22, 2025

భారత్‌పై విషం చిమ్మిన బిబిసి: బిజెపి ఆరోపణ

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: భారతదేశంపై విష ప్రచారంతో కూడిన వార్తలను ప్రసారం చేసిన బిబిసి అజెండా, ప్రతిపక్ష కాంగ్రెస్ అజెండా ఒక్కటేనని బిజెపి ఆరోపించింది. న్యూఢిల్లీ, ముంబైలోని బిబిసి కార్యాలయాలపై ఐటి శాఖ దాడులు నిర్వహించిన నేపథ్యంలో బిజెపి జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మగళవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ బిబిసిపై ప్రతీకార చర్యలకు నరేద్ర మోడీ ప్రభుత్వం పాల్పడుతోందన్న కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు.

ఐటి శాఖ అధికారులు వారిపని వారు చేసుకోవడానికి అవకాశమివ్వాలని ఆయన అన్నారు. భారత్‌లో పనిచేసే ఏ మీడియా సంస్థ అయినా దేశ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. బిబిసి కార్యాలయాలపై ఐటి శాఖ చట్టప్రకారమే చర్యలు చేపట్టిందని భాటియా చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కేంద్ర దర్యాప్తు సంస్థలను పంజరంలో చిలుకగా సుప్రీంకోర్టు అభివర్ణించిందని ఆయన గుర్తు చేశారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు.

ప్రపంచ వేదికపై భారతదేశ ఎదుగుదలను కొన్ని వర్గాలు భరించలేకపోతున్నాయని ఆయన బిబిసిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తు ప్రపంచంలో భారత్ బక్వాస్ కార్పొరేషన్‌గా బిబిసి మారిపోయిందని ఆయన విమర్శించారు. ఇలా ఉండగా బిబిసి కార్యాలయాలలో ఐటి సోదాలను ది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాతోపాటు ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. టిఎంసి ఎంపి మహువా మొయిత్రా ఐటి దాడులపై స్పందిస్తూ తర్వాత వంతు మిస్టర్ ఎ(అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ) కార్యాలపై ఉంటుందా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News