Sunday, December 22, 2024

24 గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న కొడుకుని చంపిన తండ్రి!

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 24 గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న కొడుకుని తండ్రే దారుణంగా చంపిన ఉదంతం ఢిల్లీలో కలకలం సృష్టిస్తోంది. 29 ఏళ్ల గౌరవ్ సింఘాల్ ఢిల్లీలో జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. గురువారం అతనికి వివాహం జరగవలసి ఉంది. అయితే బుధవారం రాత్రి అతని తండ్రి కొడుకుతో ఘర్షణ పడి పదునైన ఆయుధంగా హత్య చేశాడు. మృతుడి శరీరంపై 15 కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు చెప్పారు. కొడుకుని హత్య చేశాక తండ్రి పరారయ్యాడు. హత్యకు గల కారణం తెలియాల్సి ఉంది. అయితే తండ్రీకొడుకుల మధ్య కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయని బంధువులు చెప్పారు. కొడుకుని హత్య చేసిన తర్వాత తండ్రి ‘ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. కొడుకుని చంపినందుకు నేనేమీ పశ్చాత్తాపపడటం లేదు’ అని వ్యాఖ్యానించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News