Sunday, December 22, 2024

ముఖేశ్ అంబానీని వెనక్కు నెట్టిన గౌతమ్ అదానీ..

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రెండోస్థానానికి పడిపోయారు. అదానీ గ్రూప్ కంపెనీల చైర్మన్ అయిన గౌతమ్ అదానీ తాజాగా బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

ఆయన ఆస్తుల నికర విలువ 97.6 బిలియన్ అమెరికన్ డాలర్లు కాగా అంబానీ ఆస్తుల విలువ 97 బిలియన్లే కావడం విశేషం. ఇద్దరి ఆస్తుల నికర విలువల మధ్య తేడా కేవలం 600 మిలియన్లే అయినప్పటికీ, అదానీ ఆస్తుల విలువ జెట్ స్పీడులో పెరుగుతోంది. ఆసియాలోనూ అత్యంత సంపన్నుడిగా అదానీయే నంబర్ వన్ స్థానంలో ఉండటం మరొక విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News