Monday, January 20, 2025

ప్రపంచంలో 5వ అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ!

- Advertisement -
- Advertisement -
Adani
వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టి రికార్డు….

న్యూఢిల్లీ: ఫోర్బ్స్ డేటా ప్రకారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ,  దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోని ఐదవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఎదిగాడు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం, వారెన్ బఫెట్ నికర విలువ $121.7 బిలియన్లు. బఫెట్ వయసు 91 సంవత్సరాలు. అదానీ $123.7 బిలియన్ల నికర విలువ అతనిని భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తిని చేసింది.  దేశంలోని 2వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ (ఆయన విలువ $104.7 బిలియన్లు) కంటే $19 బిలియన్లు ఎక్కువ ఉన్న సంపన్నుడిగా ఫోర్బ్స్ తన నివేదికలో పేర్కొంది. యుఎస్ స్టాక్ మార్కెట్‌లో విస్తృత పతనం మధ్య శుక్రవారం ప్రఖ్యాత పెట్టుబడిదారు బెర్క్‌షైర్ హాత్వే షేర్లు 2 శాతం పడిపోయినందున అదానీ,  బఫెట్‌ను అధిగమించాడు. ఫోర్బ్స్ యొక్క రియల్ టైమ్ బిలియనీర్ ట్రాకర్ ప్రకారం, ఇప్పుడు ప్రపంచంలో అదానీ కంటే ధనవంతులు నలుగురు మాత్రమే ఉన్నారు. అదానీ కంటే ధనవంతులైన నలుగురిలో మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ (అంచనా $130.2 బిలియన్లు), ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ కింగ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ($167.9 బిలియన్లు), అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ($170.2 బిలియన్లు), టెస్లా మరియు ‘స్పేస్‌ఎక్స్’ చీఫ్ ఎలన్ మస్క్ ($269.7 బిలియన్లు) ఉన్నారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News