Sunday, December 22, 2024

ప్రపంచంలో మూడవ అతి పెద్ద సంపన్న వ్యక్తిగా గౌతమ్ అదానీ

- Advertisement -
- Advertisement -

Gautam Adani

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఒక ఆసియా వ్యక్తి మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి.

ముంబై: భారతదేశం వెలుపల కొన్ని సంవత్సరాల క్రితం గౌతమ్ అదానీ గురించి కొద్ది మందికే తెలుసు.  ఇప్పుడు భారతీయ వ్యాపారవేత్త, కాలేజీ డ్రాపౌట్, వజ్రాల వ్యాపారం నుంచి బొగ్గు వైపుకు తిరిగి తన  అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇప్పుడు అతను ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తి అయ్యాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఒక ఆసియా వ్యక్తి మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి.  తోటి సంపన్నుడు ముఖేష్ అంబానీ,  చైనాకు చెందిన జాక్ మా కూడా ఈ స్థాయికి ఇంతవరకు చేరుకోలేదు. 137.4 బిలియన్ డాలర్ల (రూ. 10.97 లక్షల కోట్లు) సంపదతో, అదానీ ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించాడు, ఇప్పుడు ర్యాంకింగ్‌లో యుఎస్‌కి చెందిన ఎలోన్ మస్క్ , జెఫ్ బెజోస్‌ల కన్నా  కాస్త వెనుకంజలో ఉన్నాడు.

అదానీ 2022లోనే తన సంపదకు 60.9 బిలియన్ డాలర్లు జోడించాడు, ఇది అందరికంటే ఐదు రెట్లు ఎక్కువ. అతను మొదటిసారిగా ఫిబ్రవరిలో అంబానీని అత్యంత ధనవంతుడైన ఆసియన్‌గా అధిగమించాడు, ఏప్రిల్‌లో సెంటిబిలియనీర్ అయ్యాడు. మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ యొక్క బిల్ గేట్స్‌ను కూడా గత నెలలో  వెనకకి నెట్టేసి ప్రపంచంలో నాల్గవ అత్యంత సంపన్న వ్యక్తిగా మారారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News