Thursday, January 16, 2025

ఒక్క నెలలోనే 3 నుంచి 38వ స్థానానికి గౌతమ్ అదానీ

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇప్పుడు గౌతమ్ అదానీ ఫోర్బ్ సంపన్నుల జాబితాలో 38వ స్థానానికి చేరుకున్నాడు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత ఆయన మూడవ స్థానం నుంచి పతనమవుతూ ఇప్పుడు 38వ స్థానానికి చేరుకున్నాడు. అదానీ నికర సంపద(నెట్‌వర్త్) ఇప్పుడు 33.4 బిలియన్ డాలర్లు. జనవరి 24 న హిండెన్‌బర్గ్ నివేదిక ప్రచురించముందు అతడి సంపద 119 బిలియన్ డాలర్లుగా ఉండింది. అందులో దాదాపు 85 బిలియన్ డాలర్ల సంపద హరించుకుపోయింది. అదానీ ఓ కామడిటీ ట్రేడర్‌గా 1988లో పయనం మొదలెట్టాడు. హిండెన్‌బర్గ్ నివేదికతో అతడి సంపద ఆవిరవుతూ వస్తోంది. అతడిప్పుడు తన సంపద కాపాడుకోడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు.

Adani graph

Adani 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News