Wednesday, January 22, 2025

గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న వ్యక్తి

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం 154.7 బిలియన్ల డాలర్ల(రూ. 12.34 లక్షల కోట్లు) విలువైన, గౌతమ్ అదానీ జెఫ్ బెజోస్,  బెర్నార్డ్ ఆర్నాల్ట్‌లను అధిగమించి సంపన్నుల జాబితాలో రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

న్యూఢిల్లీ: అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, లూయిస్‌ విట్టన్‌కు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌లను అధిగమించి గౌతమ్‌ అదానీ ఇప్పుడు ఫోర్బ్స్‌ ప్రకారం ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. అతను ప్రస్తుతం $154.7 బిలియన్ల విలువను కలిగి ఉన్నాడు. కాగా ఎలోన్ మస్క్ 273.5 బిలియన్ల నికర సంపదతో అత్యంత ధనవంతుడుగా ప్రథమ స్థానంలోనే ఉన్నాడు. గత నెలలో కూడా, మిస్టర్ అదానీ ఆర్నాల్ట్‌ను అధిగమించి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు, అయితే మస్క్ , బెజోస్‌ల వెనుక ఉన్నాడు. ఆర్నాల్ట్ ఇప్పుడు… అతని కుటుంబ నికర విలువ $153.5 బిలియన్లతో మూడవ స్థానంలో ఉన్నాడు, ఆయన సంపద ఈ రోజు $4.9 బిలియన్లు లేదా 3.08% క్షీణించింది, అయితే బెజోస్ $149.7 సంపదతో $2.3 బిలియన్లు క్షీణించి నాల్గవ స్థానంలో ఉన్నాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ 92 బిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు.

Gautam Adani 2nd richest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News