Wednesday, January 22, 2025

బిలియనీర్ జాబితాలో 16వ స్థానానికి గౌతమ్ అదానీ

- Advertisement -
- Advertisement -

వారం రోజుల్లోనే రూ.83,379 కోట్లు పెరిగిన సంపద

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ కేవలం వారం రోజుల్లోనే 10 బిలియన్ డాలర్లు అంటే రూ.83,379 కోట్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం సంపద 70.3 బిలియన్ డాలర్లకు చేరింది. ఈమేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ ఇప్పుడు 16 స్థానానికి ఎగబాకారు. ఈ జాబితాలో టాప్ 20లో చేరిన రెండో సంపన్నుడిగా అదానీ పేరు దక్కించుకోగా, ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 13 స్థానంతో జాబితాలో ఉన్నారు. ముకేశ్ నికర విలువ 90.4 బిలియన్ డాలర్లు ఉంది. హిండెన్‌బర్గ్ నివేదిక చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల విలువ భారీగా పడిపోయింది. అయితే తాజా పరిణామాలతో మళ్లీ అదానీ కంపెనీల షేర్లు పుంజుకుంటున్నాయి. ఈ కారణంగా మార్కెట్లో అదానీ సంపద గణనీయంగా పెరిగింది.

రూ.5,185 కోట్లకు సంఘీ ఇండస్ట్రీస్ కొనుగోలు
అదానీ గ్రూప్ కంపెనీ అంబుజా సిమెంట్ సంఘీ ఇండస్ట్రీస్‌ను రూ.5,185 కోట్లకు కొనుగోలు చేసింది. అదానీ గ్రూప్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ సమాచారాన్ని ఇచ్చింది. దీంతో అంబుజా సిమెంట్ షేర్లు మంగళవారం మార్కెట్లో దాదాపు 7 శాతం పెరిగాయి. కంపెనీ షేర్లు 6.94 శాతం లాభంతో రూ.507.50 వద్ద ముగిశాయి. ఈ కొనుగోలు తర్వాత, అంబుజా సిమెంట్స్ సంఘీ ఇండస్ట్రీస్‌లో 54.51 శాతం నియంత్రణ వాటాను కలిగి ఉంటుంది. అలాగే ఈ కొనుగోలు తర్వాత అంబుజా సిమెంట్స్ ఏకీకృత సామర్థ్యం 68.5 ఎంటిపిఎ నుండి 74.6 ఎంటిపిఎకి పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News