ముంబై: హిండెన్‌బర్గ్ నివేదిక వివాదం నేపథ్యంలో పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ గురువారం ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ రిసెర్చ్ నివేదికపై సంయుక్త పార్లమెంటరి కమిటీ(జెపిసి) దర్యాప్తునకు తాను వ్యతిరేకం కాదని, అయితే సుప్రీంకోర్టు కమిటీ విచారణ మంరింత ఉపయోగకరం, సమర్థవంతమని తాను భావిస్తున్నానని శరద్ పవార్ ఇటీవల ప్రకించిన నేపథ్యంలో ఆయనతో గౌతమ్ అదానీ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read:జింకను ఢీకొట్టిన వందేభారత్ రైలు… వ్యక్తిపై జింక పడడంతో
అదానీ గ్రూపు క్రమాలపై జెపిసి దర్యాప్తు కోసం కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపల, వెలుపల పట్టుబడుతుందగా శరద్ పవార్ మాత్రం అదానీ గ్రూపునకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం చర్చననీయాంశమైంది. హిండెన్‌బర్గ్ రిసెర్చ్ ఉద్దేశపూర్వకంగానే అదానీ గ్రూపును టార్గెట్ చేసినట్లు పవార్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా సావర్కర్ విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పవార్ తప్పుపట్టడం గమనార్హం.