- Advertisement -
ముకేశ్ అంబానీ వెనక్కి
ముంబయి: ఇంతకాలం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా వెలుగొందారు. కానీ ఇప్పుడు గౌతమ్ అదానీ ఆయనని వెనక్కి నెట్టేసి అగ్రస్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం గౌతమ్ అదానీ సంపదకు ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 55 బిలియన్ డాలర్లు చేరాయి. కాగా ముకేశ్ అంబానీ సంపదకు కేవలం 14.3 బిలియన్‌లు మాత్రమే చేరాయి. ఓ3సి ఒప్పందం రద్దయ్యాక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1.07 శాత పతనమై ఇప్పుడు రూ. 2360.70 వద్ద కోట్ అవుతున్నాయి. అదానీ గ్రూప్ స్టాకులు మాత్రం పెరిగాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాకులు 2.94 శాతం పెరిగి రూ. 1757.70 వద్ద ట్రేడవుతుండగా, అదానీ పోర్ట్ 4.87 శాతం పెరిగి రూ. 764.75 వద్ద ట్రేడవుతోంది.
- Advertisement -